ETV Bharat / state

ఆర్టీసీకి ఆరు నెలల్లో రూ.2,350 కోట్ల నష్టం! - corona impact on apsrtc

కరోనా కాటుతో ప్రగతి రథ చక్రం నష్టాల బాట పట్టింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో నష్టాలు మూటగట్టుకుంది. లాక్ డౌన్​తో రెండు నెలల పాటు బస్సులు డిపోలకే పరిమతమయ్యాయి. ప్రస్తుతం నడుస్తోన్న కొద్దిపాటి బస్సుల్లోనూ ప్రయాణికులు నిండక ఆశించిన లాభాలు రావడం లేదు. సగటున రోజుకు 12 కోట్లు నష్టపోతూ మరింత నష్టాల ఊబిలో కూరుకుపోతోంది ఏపీఎస్​ఆర్టీసీ.

APSRTC
APSRTC
author img

By

Published : Oct 7, 2020, 9:49 PM IST

ప్రజాసేవే పరమావధిగా సేవలందిస్తోన్న సంస్థ ఏపీఎస్ ఆర్టీసీని కరోనా వైరస్ దారుణంగా దెబ్బతీసింది. లాక్​ డౌన్ కారణంగా మార్చి 22 నుంచి మే 21 వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సంస్థ తీవ్రంగా నష్టపోయింది. అన్ లాక్ ప్రారంభంతో మే 21 నుంచి బస్సులను పునరుద్ధరించారు.

తొలుత 1700 బస్సులు రోడ్డెక్కగా, క్రమంగా పెంచుతూ ప్రస్తుతం 5600 తిప్పుతున్నారు. అంటే సంస్థలో సగం బస్సులే రోడ్డెక్కినట్లు. బస్సులు తిరుగుతున్నందున నష్టాలు తప్పుతాయని అధికారులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. పరిమిత సంఖ్యలో బస్సులు తిప్పడం, వైరస్ భయంతో ప్రయాణికులు తగ్గటంతో నష్టాలు కొనసాగుతున్నాయి.

తెగని టిక్కెట్లు

కరోనా రాకముందు ఆర్టీసీ సరాసరి సీట్ల భర్తీ నిష్పత్తి (ఆక్యుపెన్సీ రేషియో) 70 శాతం పైనే ఉండేది. అయినా సంస్థకు రోజుకు కోటి రూపాయలు నష్టం వచ్చేది. కరోనా రాకతో బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి గణనీయంగా తగ్గింది. మే నెలలో కేవలం 30 శాతం మాత్రమే సీట్లు నిండగా.. ఇప్పుడు 60 శాతానికి పెరిగింది. బస్సుల్లో అన్ని సీట్లలో కూర్చోవడానికి అనుమతించినా ఇంకా చాలా బస్సుల్లో సగం సీట్లు కూడా నిండని పరిస్థితి. గతంలో సగటున రోజుకు 42 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా ప్రస్తుతం 19 లక్షల కిలోమీటర్లకు మించడం లేదు.

కరోనాతో ఆశలకు పంక్చర్

సాధారణంగా ఆర్టీసీకి రోజుకు 16 కోట్ల వరకు రాబడి రావాల్సి ఉండగా, ఇప్పుడు కేవలం 3.63 కోట్లు మాత్రమే వస్తోంది. కరోనా వల్ల జూన్ నెలలో రోజుకు సగటున 2 కోట్లు, జులైలో 1.7 కోట్లు, ఆగస్టులో రోజుకు 2 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. అంటే రోజుకు సరాసరిగా 12 కోట్ల రూపాయలు నష్టపోతున్నట్లు లెక్క. దీనివల్ల సంస్థ ఆరు నెలల్లోనే 2,350 కోట్ల రూపాయలు నష్టపోయినట్లు అధికారులు తేల్చారు. తెలంగాణ, తమిళనాడుకు బస్సులు తిరగడం లేదు. దీనివల్ల రోజుకు 3 కోట్లపైనే రాబడి కోల్పోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీకి పలు బ్యాంకుల్లో4 వేలకోట్ల అప్పులున్నాయి. వీటికి ఏడాదికి 350 కోట్లపైగా వడ్డీలు కడుతోంది. కార్మికుల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండటం వల్ల ఈ ఏడాది అప్పులు కొంతైనా తీర్చుదామని అధికారులు భావించారు. కరోనా రాకతో అంతా తలకిందులైంది. రోజువారీ నిర్వహణ కోసం ఇంకా అప్పులు చేయాల్సిన దుస్ధితి నెలకొంది.

సర్కార్ సాయం చేయాలి

సంస్థలో ఏకంగా 4500 మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. వీరి వైద్య ఖర్చుల కోసమూ సంస్థ అదనంగా వెచ్చించాల్సి వచ్చింది. ఫలితంగా నష్టాలు పెరిగాయని ఆర్టీసీ ఎండీ ఎం.టి.కృష్ణబాబు వెల్లడించారు. సరకు రవాణా, వ్యాపారాభివృద్ధి, నిరుపయోగ భూముల అభివృద్ధి ద్వారా అదనంగా ఆదాయం ఆర్జించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ ఎన్ని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నా ప్రభుత్వాల సహకారం లేకుండా లాభాలు సాధిండం సాధ్యం కాదని కార్మిక సంఘాలు అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిబ్బంది వేతనాలను భరిస్తున్నా...మరికొంత సాయం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. లాక్​డౌన్​తో నష్టపోయిన అన్ని రవాణా సంస్థలకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.