ETV Bharat / state

'సినీ ప్రముఖులూ.. ముఖ్యమంత్రికి మీరైనా చెప్పండి' - amaravathi moment taja news

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని 3 రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా.. విజయవాడకు వచ్చిన సినీతారలు చెప్పాలంటూ ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ కోరారు.

APCC PRCIDENT SUNKARAPADMASRI DEMANDS TOLLY WODD ACTORS SUGEST AP CM ABOUT TAKE BACK 3 CAPITALS ISSUE

author img

By

Published : Jun 9, 2020, 6:35 PM IST

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని విజయవాడకు వచ్చిన సినీతారలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పాలంటూ... ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులు 175 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సినిమాలు తీసుకోవటానికి, స్టూడియోలు ఏర్పాటు చేసుకోవటానికి మాత్రం ఏపీలో భూములు కావాలి కానీ.. రాజధాని సమస్య సినిమావాళ్లకు పట్టదా అని ఆమె నిలదీశారు.

సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం అనాలోచితమైందని విమర్శించారు. ఈ నిర్ణయం కారణంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని అమరావతినే రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

15 రోజుల్లో కూలీల్ని స్వస్థలాలకు చేర్చండి: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.