ETV Bharat / state

కరోనా ప్రభావం.. అపార్ట్‌మెంట్లలో అప్రమత్తం - live updates of corona virus in andhrapradesh

కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు లాక్‌డౌన్ పాటించటం ఎంత ముఖ్యమో స్వీయ నియంత్రణా అంతే ముఖ్యం. పట్టణాల్లో ఎక్కువ శాతం బహుళ అంతస్తుల్లో జన జీవనం ఉంటున్నందున.... అక్కడ తగు జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెబున్నారు. అందుకు అనుగుణంగా అనేక చోట్ల ప్రజలు పలు నియమాలు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

apartments safety measures for corona virus
కరోనా ప్రభావం: అపార్ట్‌మెంట్లలో అప్రమత్తం
author img

By

Published : Apr 10, 2020, 5:59 PM IST

Updated : Apr 11, 2020, 11:54 AM IST

దాదాపు 20 వేలకు పైగా అపార్ట్‌మెంట్‌లు ఉన్న విజయవాడ నగరంలో ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివారిలో 50 శాతం మంది తగు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ... మిగిలినవారు కూడా జాగరూకతతో వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు. స్వీయ నియంత్రణలో భాగంగా కొందరు తమ భవనాల్లోకి బయటవారు రాకుండా పూర్తిగా నియంత్రిస్తున్నారు. సంచారాన్ని పరిమితం చేయటానికి ఒక గేటు మాత్రమే తెరిచి ఉంచుతున్నారు. మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు రెయిలింగ్ సాయం తీసుకోకపోవటం, లిఫ్ట్ వాడేటప్పుడు బటన్లు నొక్కటానికి గ్లౌజులు ధరించటం, లేదా మోచేతిని వాడటం లాంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సూచనలకు నగర వాసులు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ప్రతిరోజు అపార్ట్‌మెంట్ గేటుతో పాటు లిఫ్ట్ డోర్లు, మెట్ల రెయిలింగ్, మెట్లు తప్పనిసరిగా శుభ్రం చేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లలో బయటకు వెళ్లినవారు మూడు రోజులు దాటితే తిరిగి లోపలికి రానివ్వట్లేదు. నిత్యావసర సరుకులకు బయటకు వెళ్లి వచ్చేవారు గేటు వద్దే చేతులు శుభ్రం చేసుకుని లోపలికి వచ్చేలా చర్యలు చేపట్టారు. అపార్ట్‌మెంట్లలో తరచుగా కనిపించే పుట్టినరోజు, పెళ్లిరోజుల వంటి వేడుకలకు కొన్ని రోజులపాటు స్వస్తి చెప్పారు. ఇళ్లలోనే వ్యాయామం, ధ్యానం వంటివి చేస్తున్నారు.పుస్తక పఠనం, సాయంత్రం వేళల్లో భౌతిక దూరం పాటిస్తూ చిన్నపాటి ఆటలతో కాలక్షేపం చేస్తున్నారు.

విజయవాడ నడిబొడ్డున ఉన్న అపార్ట్‌మెంట్లతో పాటు.. నగరానికి ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాల్లోనూ ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇలా అన్నిచోట్లా తగు చర్యలు చేపట్టడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కరోనా ప్రభావం.. అపార్ట్‌మెంట్లలో అప్రమత్తం

ఇదీ చూడండి:

అప్రమత్తంగా లేకుంటే ముప్పే: యూకేలో స్థిరపడిన భారతీయ వైద్యుడు

Last Updated : Apr 11, 2020, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.