ETV Bharat / state

చంద్రబాబు రాష్ట్రానికి సీఎం అని వైకాపా నేతలు భావిస్తున్నారా?: తెదేపా - ఏపీలో కరోనా కేసుల సంఖ్య

కరోనా కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెదేపా నేతలు మండిపడ్డారు. కరోనా నివారణ కంటే ప్రతిపక్షాలను వేధించటమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఆస్పత్రిలో బాధితుల ఆర్తనాధాలు సీఎంకు వినపడటం లేదా అంటూ ప్రశ్నించారు.

tdp
tdp
author img

By

Published : May 10, 2021, 3:30 PM IST

"కరోనా ఎన్ 440కే వైరస్ వ్యాప్తిపై జాగ్రత్తగా ఉండాలన్న తెదేపా అధినేత చంద్రబాబుపై కేసు పెట్టిన పోలీసులు... మంత్రి సీదిరి అప్పలరాజుపై ఎందుకు పెట్టలేదు" అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. కరోనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబుపై క్రిమినల్ కేసు పెట్టారని ఆరోపించారు. కరోనా నివారణ కంటే ప్రతిపక్షాలను వేధించటమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకున్నారని అన్నారు.

సీఎం నిర్లక్ష్యానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రుల్లో బాధితుల ఆర్తనాదాలు ముఖ్యమంత్రికి వినిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోక.. రాష్ట్ర ప్రజల్ని సంక్షోభంలోకి నెడుతోందని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరాం ప్రసాద్ ధ్వజమెత్తారు.

పొరుగు రాష్ట్రాలు ముందస్తుగా వ్యాక్సిన్ల కొనుగోళ్లకు పెద్దఎత్తున ఆర్డర్లు పెడితే చంద్రబాబు వ్యాక్సిన్ ఇప్పించాలని వైకాపా నేతలు మాట్లాడుతున్నారు. చంద్రబాబే ఇంకా ముఖ్యమంత్రని వైకాపా భావిస్తోందా? సంక్షోభాలను అరికట్టడంలో చంద్రబాబుకు ఉన్న అనుభవం ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రభుత్వపరంగా చెయ్యాల్సిన పనులు చేయకుండా ప్రతిపక్షాలపై నెపం నెట్టడం తగదు. సంక్షోభం నివారణకు కేంద్రం ఇచ్చిన దాదాపు రూ. 8వేల కోట్లు ఏం చేశారు. రాష్ట్రంలో చాలా రోజుల నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లు వేసే ప్రక్రియను నిలిపివేశారు. వెంటనే ఆ ప్రక్రియను పునరుద్ధరించాలి."- బుచ్చిరాం ప్రసాద్

ఇదీ చదవండి:

గంగానదిలో తేలిన 50 మృతదేహాలు.. ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.