రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నందున వినియోగదారులంతా విద్యుత్ పొదుపు చేయాలని సూచిస్తూ డిస్కమ్‌లు ప్రచారం చేస్తున్నాయి(power discoms in andhra pradesh news). విజయవాడ కేంద్రంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ , విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ, అలాగే తిరుపతి కేంద్రంగా ఉన్న దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగాన్ని తగ్గించాలంటూ తమదైన శైలిలో వినియోగదారులకు సూచనలు చేస్తున్నాయి.
బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొందని అందుకే ఎక్కువ ధర పెట్టి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోందని డిస్కమ్ లు వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాయి. వీలైనంత తక్కువ విద్యుత్‌ను వాడుకోవాలని తద్వారా వచ్చే నెలలోని ఛార్జీలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వినియోగదారులదేనని స్పష్టం చేస్తున్నాయి. తదుపరి సర్దుబాటు ఛార్జీలు పడకుండా వినియోగదారులు ఇప్పుడే జాగ్రత్త పడాలంటూ డిస్కమ్ లు వినియోగదారులను హెచ్చరిస్తున్నాయి.
ఇదీ చదవండి