APJAC AMARAVATI President Bopparaju Meets Union Leaders: ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని నేపథ్యంలో న్యాయమైన డిమాండ్ల సాధనకై 43 రోజులుగా ఉద్యమిస్తున్నామని ఏపీ జేఏసీ(ఐక్య కార్యాచరణ సమితి) అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు అన్ని ఉద్యోగ, కార్మిక సంఘాల మద్దతు కోసం బొప్పరాజు బృందం విజయవాడలో వారి కార్యాలయాలకు వెళ్లి తమ ఉద్యమానికి మద్దతు తెలియాజేయాలని కోరింది.
ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తున్నందని బొప్పరాజు మండిపడ్డారు. దీంతో వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యమానికి పిలుపునిచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో సీపీయస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
"ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని నేపథ్యంలో న్యాయమైన డిమాండ్ల సాధనకై 43 రోజులుగా ఉద్యమిస్తున్నాము. ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు అన్ని ఉద్యోగ, కార్మిక సంఘాల మద్దతు కోసం మా బృందంతో కలిసి విజయవాడలో వారి కార్యాలయాలకు వెళ్లి ఈ ఉద్యమానికి మద్దతు తెలియాజేయాలని కోరాము. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తున్నంది. దీంతో వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము ఉద్యమానికి పిలుపునిచ్చాము." - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్
ఈ నెల 25, 29 తేదీల్లో చేపట్టే ధర్నాలకు కార్మిక సంఘాల తరపున పూర్తి మద్దతిస్తున్నట్లు సీఐటీయూ నాయకులు సీహెచ్ నరసింగరావు తెలిపారు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమానికి ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం అనంతరం వారి ఉద్యమానికి మద్దతు పలుకుతామని ఆయన తెలిపారు.
"ఈ నెల 25, 29 తేదీల్లో చేపట్టే ధర్నాలకు కార్మిక సంఘాల తరఫున మా పూర్తి మద్దతు తెలుపుతున్నాము. ఏపీజేఏసీ అమరావతి ఉద్యమానికి ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం అనంతరం వారి ఉద్యమానికి మద్దతు పలుకుతాము." - సీహెచ్ నరసింగరావు, సీఐటీయూ నాయకులు
ఇప్పటికే ఉమ్మడిగా పెట్టిన 70 డిమాండ్లును ప్రభుత్వం పరిష్కరించలేదని ఏపీ ఎన్జీవో సంఘం నాయకులు బండి చంద్రశేఖర్ అన్నారు. సమస్యల పరిష్కారానికి ఏపీజేఏసీ అమరావతితో కలిసి ఉద్యమంలో పాల్గొంటామని ఆయన పేర్కొన్నారు.
"ఇప్పటికే ఉమ్మడిగా పెట్టిన 70 డిమాండ్లును ఏపీ సర్కారు పరిష్కరించలేదు. ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ఎన్జీవో కలిసే సమస్యల పరిష్కారానికై ఉద్యమంలో పాల్గొంటాయి." - బండి చంద్రశేఖర్, ఎన్జీవో సంఘం నాయకులు
ఇవీ చదవండి: