ETV Bharat / state

జాతీయ ఉపాధిహామీ పెండింగ్ బిల్లులపై హైకోర్టులో విచారణ

జాతీయ ఉపాధిహామీ పెండింగ్ బిల్లులపై హైకోర్టులో విచారణ జరిగింది. రూ.25 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. పనులు, పెండింగ్‌ బిల్లులకు కారణాలు తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది.

Ap high court hearing on narega funds petitions

author img

By

Published : Jan 28, 2021, 4:32 PM IST

జాతీయ ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను చెల్లించే విధంగా ఆదేశించాలని కోరుతూ... పలువురు వేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. రూ.25 వేల కోట్లు మేర బిల్లులు పెండింగ్​లో ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాసరావు, వీరారెడ్డి, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఇప్పటివరకు ఎంత మేర పనులు జరిగాయి..? ఎంత మేర నిధులు చెల్లించారు, పెండింగ్​లో ఎంత ఉందో పూర్తి వివరాలు తమకు అందజేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని కోరింది.

ఏడు లక్షల అరవై వేల పనులకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. ఇప్పటివరకు రూ.490 కోట్లు రూపాయల మేర నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వ న్యాయవాదులు ధర్మాసనానికి వెల్లడించారు. కొన్నింటిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిందన్నారు. పూర్తి వివరాలు అందజేసేందుకు రెండు వారాలు సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరారు. తదుపరి విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: 2019 ఓటరు జాబితాతో ఎన్నికలపై విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.