ETV Bharat / state

'కొవిడ్-19 ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి 675 మంది' - ఏపీలో కరోన కేసులు తాజా వార్తల

కరోనా నిరోధక చర్యలపై ఏపీ వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి బులెటిన్ విడుదల చేశారు. వదంతులు నమ్మవద్దన్న ఆయన... సమాచారం కోసం కంట్రోల్​ రూం నంబరును 0866-2410978 ను ప్రకటించారు. వైద్య సలహాల కోసం 104 టోల్‌ఫ్రీ ఏర్పాటు చేశామని తెలిపారు. కొవిడ్-19 ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి 675 మంది వచ్చారని వివరించారు. వారికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ap health center release bulletin on corona cases

author img

By

Published : Mar 14, 2020, 2:57 PM IST

నెల్లూరు జిల్లాలో కొవిడ్-19 పాజిటివ్ బాధితుడు కోలుకుంటున్నారని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. 14 రోజుల తర్వాత మళ్లీ నమూనాలు పరీక్షించి డిశ్చార్జ్‌ చేస్తామని అన్నారు. కొవిడ్-19 విషయంలో ఆందోళన చెందవద్దని సూచించారు. వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. పూర్తిస్థాయిలో మాస్కులు అందుబాటులో ఉంచామని తెలిపారు. సమాచారం కోసం కంట్రోల్ రూం నం. 0866-2410978 ను ప్రకటించారు. కొవిడ్ 19 లక్షణాలు ఉంటే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని పేర్కొన్నారు. వైద్య సలహాల కోసం 104 టోల్‌ఫ్రీ ఏర్పాటు చేశారు.

పలు దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టాం

కొవిడ్-19 ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి 675 మంది వచ్చారని వివరించారు. వారంతా వైద్యుల పరిశీలనలో ఉన్నారని అన్నారు. 428 మంది ఇళ్లల్లోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 233 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయిందన్నారు. ఆస్పత్రిలో 14 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. 61 మంది నమూనాలను ల్యాబ్‌కు పంపగా... 52 మందికి నెగిటివ్ అని తేలిందన్నారు. 8 మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. పలు దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టామన్నారు.

విశాఖ ఎయిర్‌పోర్టులో 8691 మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేశామని వివరించారు. వీరిలో 64 మందికి వ్యాధి లక్షణాలున్నాయని స్పష్టం చేశారు. విశాఖ/గన్నవరం ఓడరేవులో 1088 మంది ప్రయాణికుల్ని స్క్రీనింగ్ చేశామన్నారు. వీరిలో ఒక్కరికి కూడా వ్యాధి లక్షణాలు లేవన్నారు. కృష్ణపట్నం ఓడరేవులో 622 మంది ప్రయాణికులను స్క్రీనింగ్ చేశామని తెలిపారు. వీరిలో ఒక్కరికి కూడా వ్యాధి లక్షణాలు లేవని ధృవీకరించారు. వ్యాధి లక్షణాలున్నా, లేకపోయినా ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మాస్క్‌ ధరించాలని తెలిపారు.

ఇవీ చదవండి: రూపాయికే నోరూరించే బిర్యానీ.. ఎగబడ్డ జనం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.