విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం పేరుతో నిర్వహించిన సర్వ సభ్య సమావేశానికి, తమ సంఘానికి ఎటువంటి సంబంధం లేదని ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు శాంతి భవాని తెలిపారు. తమ సంఘం సభ్యులను రెండు సంవత్సరాల క్రితం ఎన్నికల ద్వారా 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకున్నారని ఆమె అన్నారు. వారి సంఘంలో కోశాధికారిగా పేర్కొన్న శాంతమ్మ ప్రస్తుతం తమ సంఘంలో కోశాధికారిగా కొనసాగుతున్నారన్నారు.
ప్రభుత్వ నర్సుల సమస్యలపై రెండేళ్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పోరాడుతున్నామని.. తమ సంఘంలో చీలిక తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మద్దతుతో నకిలీ సంఘాలు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ఎటువంటి ఎన్నికలు లేకుండా సంఘంలోని సభ్యులను, అధ్యక్షులను ఎలా ఎన్నుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని శాంతి భవాని కోరారు.
ఇదీ చదవండి: సచివాలయ ఉద్యోగుల మృతి పట్ల.. మంత్రి పెద్దిరెడ్డి దిగ్భ్రాంతి