రస్ అల్‌ఖైమాతో వివాదాన్ని కోర్టు బయటే పరిష్కరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆర్బిట్రేషన్ కోర్టులో కాకుండా బయటే సెటిల్ చేసుకునేందుకు సిద్ధమవుతోంది. రిఫైనరీలో 12 శాతం వాటాను పెన్నా గ్రూప్‌తో కొనిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫలితంగా ఆర్బిట్రేషన్, జరిమానా కేసుల నుంచి బయటపడొచ్చని సర్కార్ భావిస్తోంది.
ఆర్బిట్రేషన్‌లో 65 మిలియన్ డాలర్ల మేర పరిహారాన్ని రస్ అల్‌ఖైమా కోరుతుంది. ప్రస్తుతం 40 మిలియన్ డాలర్లే చెల్లించడంపై ఆర్బిట్రేషన్‌లో వాదనలే కాకుండా.. మరోవైపు భారత్-రస్ అల్‌ఖైమా మధ్య ఒప్పందం ఉల్లంఘనపై లండన్ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఫలితంగా సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని ఏపీపై కేంద్రం ఒత్తిడి చేస్తోంది. నవంబరు 21-22న మరోసారి లండన్ కోర్టులో ఆర్బిట్రేషన్ ప్రక్రియ వాదనలు జరగనున్నాయి. ఈలోగా ప్రైవేటుగా వ్యవహారం చక్కబెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది. కోర్టులో కేసు విత్‌డ్రా చేసుకునేలా రస్ అల్‌ఖైమాకు షరతు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి
CM Jagan: అభిమానులకు బీపీ వచ్చింది.. రియాక్ట్ అయ్యారు: సీఎం జగన్