రాష్ట్రంలో వ్యవసాయానికి పగలు 9 గంటల ఉచిత విద్యుత్‌ను ఇచ్చేందుకు ఏర్పాటు చేయనున్న 10 వేల మెగావాట్ల నూతన సౌర విద్యుత్ ప్రాజెక్టుకు స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతీ వెయ్యి రూపాయల ముఖ విలువ కలిగిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్క రూపాయిగా నిర్ధారిస్తూ ఆదేశాలిచ్చింది. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ భూ లావాదేవీలపై భారతీయ స్టాంపు రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇచ్చింది. నూతన సౌర విద్యుత్ ప్రాజెక్టుకు 28.14 వేల ఎకరాలు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తం రూ.15.23 కోట్ల మేర స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ మినహాయిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ నోటిఫికేషన్లు జారీ చేశారు.
ఇదీ చదవండి