ETV Bharat / state

సచివాలయ ఆరోగ్య మిత్రలుగా ఏఎన్ఎంల నియామకం - ఏపీ ప్రభుత్వం వార్తలు

ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు సచివాలయ ఆరోగ్య సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం నూతన బాధ్యతలను అప్పగించింది. వారిని సచివాలయ ఆరోగ్య మిత్రలుగా నియమిస్తూ వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది.

anm
anm
author img

By

Published : Aug 21, 2020, 7:54 PM IST

సచివాలయ ఆరోగ్య మిత్రలుగా ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు సచివాలయ ఆరోగ్య సహాయకులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశాలన్నీ సచివాలయ ఆరోగ్య మిత్రలు పర్యవేక్షిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓ సిఫార్సుల మేరకు ఏఎన్ఎంలు, గ్రామ, వార్డు సచివాలయ ఆరోగ్య సహాయకులకు కొత్తగా ఈ బాధ్యతలు అప్పగిస్తూ వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది.

సచివాలయ ఆరోగ్య మిత్రల విధులు

  • ఆరోగ్య శ్రీ నెట్​వర్క్​ ఆస్పత్రులకు లబ్ధిదారులను పంపించాలి
  • నగదు రహిత చికిత్సకు సహకరించాలి
  • రోగుల దరఖాస్తులను పరిశీలించి ఆన్​లైన్ పోర్టల్​లో నమోదు చేయాలి
  • రోగులకు ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలి
  • ఆరోగ్యశాఖకు సంబంధించిన ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
  • ఆరోగ్య క్యాంపుల్లో పాల్గొనాలి

ఈ కార్యకలాపాలకు సంబంధించి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు జిల్లా కోఆర్డినేటర్లకు సచివాలయ ఆరోగ్య మిత్రలు రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో నూతనంగా జారీ చేసిన ఈ మార్గదర్శకాలతో పాటు... ఆరోగ్యశ్రీ నెట్​వర్క్ ఆస్పత్రుల జాబితాను కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాల్సిందిగా వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిబంధనల చిక్కులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.