ETV Bharat / state

'అటవీ భూములపై గిరిజనులకు హక్కులు'

ఆదివాసీ దినోత్సవం నాటికి గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయం చేసుకునే గిరిజనలకు ఉపాధి, ఆదాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జీవో నెంబర్ 3పై గిరిజనుల ప్రయోజనాలు రక్షించేలా అన్ని ప్రయత్నాలు చేస్తామని సీఎం భరోసా ఇచ్చారు.

author img

By

Published : Jun 15, 2020, 9:50 PM IST

cm jagan
cm jagan

అటవీ భూములపై గిరిజనులకు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆర్​వోఎఫ్​ఆర్ పట్టాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, పి.పుష్ప శ్రీవాణి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆదివాసీ దినోత్సవం నాటికి గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని చెప్పారు. ప్రతి ఆర్​వోఎఫ్‌ఆర్‌ పట్టాను ఆధార్‌తో లింక్‌ చేయాలని.. గిరిజనులకు మేలు జరిగేలా చూడాలని సూచించారు. వ్యవసాయం చేసుకునే గిరిజనులకు జీవనోపాధి కల్పించేలా ఉండాలని సీఎం జగన్ అన్నారు. అటవీ భూములపై హక్కులు కల్పించే అంశంలో అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు.

జీవో నంబరు 3పై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ప్రస్తావించారు. గిరిజనుల ప్రయోజనాల పరిరక్షణ కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. జీవో నంబరు 3పై సుప్రీం కోర్టు తీర్పులోని అంశాలను నిశితంగా అధ్యయనం చేయాలని ఇదివరకే ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. పరిశీలన పూర్తయ్యాక అన్ని చర్యలు తీసుకుంటామని... గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల కృషి చేస్తుందని సీఎం స్పష్టం చేశారు.
ఇదీ చదవండి

శాసనసభ బడ్జెట్ సమావేశాలు.. కేవలం రెండే రోజులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.