ETV Bharat / state

అమరావతికి ఏపీఈఆర్‌సీ ప్రధాన కార్యాలయం - AP Erc operations

ఏపీ ఈఆర్​సీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాష్ట్ర రాజధాని ప్రాంతానికి మారుస్తూ ఇంధనశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి అమరావతి నుంచి కార్యకలాపాలు జరుగుతాయని నోటిఫికేషన్​లో ప్రకటించారు.

అమరావతిలో ఏపీ ఈఆర్​సీ ప్రధాన కార్యాలయం
author img

By

Published : Jul 30, 2019, 12:26 PM IST

రాష్ట్ర భూభాగంలోనే...ఈఆర్​సీ ప్రధాన కార్యాలయం

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలి(ఈఆర్​సీ) ప్రధాన కార్యాలయాన్ని ఏపీ భూభాగంలోకి మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటినుంచి...ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఏపీ ఈఆర్​సీ ప్రధాన కార్యాలయంగా ఉంటుందని ప్రభుత్వం ఈ నోటిఫికేషన్​లో పేర్కొంది. ఇప్పటివరకు హైదరాబాద్లో కొనసాగిన ఏపీ ఈఆర్సీ ప్రధాన కార్యాలయాన్ని...అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రకటన జారీ చేసింది. విద్యుత్ నియంత్రణ మండలి కార్యాలయాన్ని తక్షణమే మార్పు చేస్తూ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి : గురుకుల విద్యార్థినిలు..సృజనాత్మకతలో అగ్రగణ్యులు

Intro:ap_knl_111_30_urukundaka_padayathra_abb_ap101311
యాంకర్ బైట్స్ :1)ఉరుకుందు ,2 )చిన్న శాలన్న,3) శాంతప్ప
రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా.
శీర్షిక :ఉరుకుంద ఈరన్న స్వామి కి తరలి వెళ్లిన భక్తులు

Body:కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన భక్తులు శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రానికి పాదయాత్రన తరలి వెళ్లారు. శ్రావణమాసం ఆరంభానికి ముందు వచ్చే అమావాస్యకు భక్తులు వెళ్ళటం ఆనవాయితీ. జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కౌతాళం మండలం ఉరుకుంద లో వెలసిన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి ని పాదయాత్రలో వెళ్లి దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం .దాంతో గత కొన్ని సంవత్సరాలుగా వందల సంఖ్యలో భక్తులు కోడుమూరు నుంచి ఎమ్మిగనూరు ,పెద్ద తుంబలం మీదుగా స్వామి క్షేత్రానికి వెళ్లారు.

Conclusion:ముందుగా కోడుమూరులో వెలసిన శ్రీ కాళికాదేవికి, కోటవీధిలో వెలసిన శ్రీ సాయిబాబాకు, మెయిన్ బజార్ లో వెలసిన శ్రీ నీలకంటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ మీదుగా బాణసంచా మేళతాళాల మధ్య పాదయాత్ర వెళ్లే భక్తులకు గ్రామస్తులు వీడ్కోలు పలికారు. ఓ భక్తుడు వీరభద్రస్వామి వేషధారణతో నృత్య ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు పాదయాత్రలో వెళ్లే భక్తులకు ఉరుకుందు సప్లయర్స్ రహదారి వెంట అన్నదానాన్ని ఏర్పాటు చేసింది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.