డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని లోకేశ్ పరామర్శిస్తే కొందరు నాయకులకు ఎందుకంత బాధ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. తెదేపాని తప్పుపట్టే బదులు.. సుధాకర్ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఎలాంటి న్యాయం చేయాలని ఆలోచిస్తే మంచిదని హితవు పలికారు.
శవ రాజకీయాలకు మారుపేరు ఇప్పుడు అధికారంలో ఉన్నవారేనని ప్రజలకు బాగా తెలుసని విమర్శించారు. శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించింది... బాబాయ్ శవాన్ని బాత్రూమ్‌లో ఉంచిందెవరో ప్రజలకు బాగా తెలుసన్నారు. కొవిడ్ నియంత్రణలో రాష్ట్రాన్ని రెండో స్థానంలో నిలిపాడంటే ఎవరైనా నమ్ముతారా అని వంగలపూడి అనిత నిలదీశారు.
ఇదీ చదవండి