ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి ధాన్యం రవాణాకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిని కోరారు. సంఘం ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు నేతృత్వంలోని అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కలసి వినతి పత్రం అందించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రవాణాకు ప్రభుత్వం అనుమతించక పోవడంతో తాము రవాణాను నిలిపివేశామని, అయితే కొందరు మిల్లర్లు రైల్వే వ్యాగన్ల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని తెప్పిస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో ఏ ధాన్యం తీసుకురావాలో చర్చించి తమకు తగిన అనుమతి ఇవ్వాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రవాణా పూర్తిగా నిలిపివేయడం వల్ల చాలా మంది లారీ యజమానులు, వాటిపై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి గణనీయంగా తగ్గి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. లారీ యజమానుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ధాన్యం రవాణాకు అనుమతి ఇవ్వాలని కోరారు.
ఇవీ చదవండి