కొవిడ్ చికిత్స కోసం హైదరాబాద్కి వెళ్తున్న అంబులెన్స్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కాచవరం గ్రామం వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా కోడూరుకు చెందిన రంగనాయకులు మరణించగా.. ఆయన భార్య అన్నపూర్ణమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ డ్రైవర్ షేక్ సైదా గాయపడ్డారు. వీరు పాలకొల్లు కొవిడ్ సెంటర్ నుంచి... చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ సంఘటన జరిగింది. క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి. అంతిమ సంస్కారంలో అన్నీ తామై..!