రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ ఏడాదిగా ఉద్యమం చేస్తున్నా... ఏనాడూ రైతులతో మాట్లాడని ముఖ్యమంత్రి జగన్.. ఉద్యమంపై అవాస్తవ ప్రకటనలు చేయడమేంటని అమరావతి పరిరక్షణ సమితి ప్రశ్నించింది. విజయవాడలోని ఐకాస కార్యాలయంలో జేఏసీ సభ్యులు మీడియాతో నిర్వహించారు. రాజధాని రైతుల ఉద్యమాన్ని హేళన చేస్తూ సీఎం, మంత్రులు చేసిన ప్రకటనలను ఖండించారు.
అమరావతి ఆవశ్యకత వివరిస్తూ.. ప్రతీ గ్రామం, మండలాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాయపూడిలో మాదిరిగానే ప్రతి జిల్లాలో జనభేరి సభ నిర్వహించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ ఆళ్ల శివారెడ్డి తెలిపారు. రాజధాని కొనసాగేలా మరో ప్రకటన చేసేంతవరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: