విజయవాడ నోవాటెల్ హోటల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘అమరావతి పొయెటిక్ ప్రిజమ్’ కార్యక్రమం ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా 86 దేశాలకు చెందిన 761 మంది కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 125 భాషల్లో 1,303 కవితలను చదివి వినిపించారు. సృజనకు పట్టం కట్టాలనే ఉద్దేశంతో ఏటా దీనిని నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఈ కవి సమ్మేళనానికి పెద్ద ఎత్తున కవులు హాజరయ్యేలా కల్చరల్ సెంటర్ గౌరవ సలహాదారు పద్మజా అయ్యంగార్, సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ముఖ్యపాత్ర పోషించారని కల్చరల్ సొసైటీ ఛైర్మన్ హరిశ్చంద్రప్రసాద్ తెలిపారు.
ఇదీ చూడండి: