ETV Bharat / state

' అమరావతిలో శిలాఫలాకాన్ని తీసేసి విశాఖకు రండి'

విశాఖలో రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీ హాజరుకావలనుకోవటం తప్పని అమరావతి మహిళా జేఏసీ, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ విమర్శించారు. అమరావతిలో శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ మళ్లీ విశాఖలో ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మోదీ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని వాళ్ల చేతులతోనే తీసేసి ఆపై విశాఖలో శంకుస్థాపన చేయండని ఆమె డిమాండ్ చేశారు.

amaravathi jac member sunkar padma demands pm modi not to come visakha for capital foundation stone programme

author img

By

Published : Aug 12, 2020, 4:35 PM IST

ప్రధాని హోదాలోనే మోదీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, ఇప్పుడు మళ్లీ విశాఖలో శంకుస్థాపనకు మోదీ హాజరుకావటం తప్పని అమరావతి మహిళా ఐకాస, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ విమర్శించారు. విశాఖలో రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీకి ఆహ్వాన పత్రిక కూడా పంపినట్లు ప్రచారం జరుగుతుందన్నారు. మళ్లీ వైజాగ్​లో ఏ మొహం పెట్టుకొని ఇంకో రాజధాని శంకుస్థాపన చేస్తారని ఆమె మండిపడ్డారు.

రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు కన్నీరు పెడుతున్నా.. మోదీ, జగన్ పట్టించుకోకుండా అమరావతిని హత్య చేస్తున్నారన్నారు. భాజపా నేతలు, ప్రధాని మోదీ విశాఖలో శంకుస్థాపనకు రావాలి అనుకుంటే అమరావతిలో మోదీ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని వాళ్ల చేతులతోనే తీసేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాజధానులoటూ అడ్డగోలు నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తప్పు అని త్వరలో న్యాయస్థానాలు తీర్పు ఇస్తాయన్న నమ్మకం ఉందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏపీకి మూడు రాజధానులు పెడుతున్నారో అలాగే మన దేశానికి కూడా రెండో రాజధాని అవసరమన్నారు. దేశ రాజధాని ఢిల్లీ బాగా దూరంగా ఉంది కాబట్టి , రెండో రాజధానిని దక్షిణ భారతాన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

హైదరాబాద్​లో రాష్ట్రపతి విడిది ఉందని, అమరావతిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి

ఆర్థిక స్వావలంబన లేక మహిళలు పడుతున్న ఇబ్బందులు చూశా: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.