కృష్ణా జిల్లాలో లాక్డౌన్ను విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. జనసంచారాన్ని కట్టడి చేసేందుకు అధికారులతో కలిసి చర్యలు చేపడుతున్నామన్నారు. రైతు బజార్ల వద్ద రద్దీ నియంత్రణకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. నగరంలో మంగళవారం నుంచి మున్సిపల్ మైదానాల్లో తాత్కాలిక రైతుబజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నిత్యావసరాలు కాకుండా ఇతర షాపులు తెరిస్తే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు.
లాక్డౌన్కు అందరు సహకరించాలి: వెల్లంపల్లి
కరోనా వైరస్ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రజలు సహకరించాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు. నిత్యావసర షాపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరూ అధికంగా కొనుక్కుని దాచుకునే ప్రయత్నం చేయొద్దన్నారు. విజయవాడలో తాత్కాలిక రైతు మార్కెట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
లాక్డౌన్కు అందరు సహకరించాలంటున్న మంత్రి వెల్లంపల్లి