ETV Bharat / state

'ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకోండి' - అక్రమ ఇసుక రవాణాను అడ్డుకొవాలని డిమాండ్ చేసిన అఖిలపక్ష నేతలు

కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఇసుక తవ్వకాల కారణంగా పెద్ద పెద్ద గోతులు పడి నది కోతకు గురవుతోందని చెప్పారు.

illegal sand smuggling
అక్రమ ఇసుక తవ్వకాలు అడ్డుకొండి
author img

By

Published : Dec 28, 2020, 1:22 PM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పరిధిలోని నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని.. ఈ దందాను అడ్డుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఇసుక దందా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలకు నీరు అందించే అక్విడక్ట్ కు 300 మీటర్ల దూరంలో తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

ఈ ప్రాంతం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ లో ఉన్నప్పటికి అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్ద పెద్ద గోతులు పడి నది కోతకు గురవుతోందని ఆవేదన చెందుతున్నారు. ఈ కారణంగా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అక్రమ తవ్వకాలు చేస్తున్న వారి పై చర్యలు తీసుకొవాలని స్థానికులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

పేదల ఇళ్లకు జాతీయ గుర్తింపు.. రాష్ట్రానికి చెందిన ముగ్గురికి ప్రధానిని కలిసే అవకాశం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.