కృష్ణా పరివాహక ప్రాంతంలోనే కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. విజయవాడలోని కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రంలో అఖిలపక్ష నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని వేరే చోట ఏర్పాటు చేయాలన్నది... సరైన నిర్ణయం కాకపోయినా, ప్రభుత్వం మూర్ఖంగా ముందుకు వెళ్తోందని నేతలు మండిపడ్డారు.
బోర్డను కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయకుండా, 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖలో పెట్టడం ఏంటని నిలదీశారు. కృష్ణా బోర్డును రాయలసీమ లేదా విజయవాడలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భాజపా నేతలు రాజధానిపై స్పష్టత ఇవ్వాలనీ... రాష్ట్రంలో ఒక మాట, దిల్లీలో మరొక మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా బోర్డును విశాఖలో ఏర్పాటు చేసే నిర్ణయాన్ని భాజపా ఎందుకు వ్యతిరేకించటం లేదని ప్రశ్నించారు. బోర్డును ఎందుకు తరలిస్తున్నారో ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలన్నారు.
ఇదీ చదవండి:
ఇళ్ల పట్టాల పంపిణీలో ఎలాంటి వసూళ్లు చేయడం లేదు: గణేష్ రెడ్డి