కరోనా విజృంభిస్తున్న సమయంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ... సరైన నిర్ణయం కాదని ఏఐసీసీ సభ్యులు నరహరశెట్టి నరసింహారావు అన్నారు. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసి.. గత మార్కులను ప్రామాణికంగా తీసుకుని ఉత్తీర్ణులను చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రే మాస్క్ ధరించకుండా ప్రజలకు మాస్కు పెట్టుకోవాలని ఎలా సందేశాలిస్తారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఆక్సిజన్, బెడ్లు, మందుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దారుణమని నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: