ప్రభుత్వాలు ఎన్నో నిరుపయోగమైన కార్యక్రమాలకు నిధులు వెచ్చిస్తున్నారు కానీ.. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో ఆసక్తి చూపడం లేదని రిటైర్డ్ ప్రొఫెసర్ నారాయణ అన్నారు. బడ్జెట్లో కేటాయించిన నిధులకు జీవో ఇచ్చి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం చేపట్టిన 48 గంటల నిరసన దీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ప్రభుత్వాలు మారుతున్నా బాధితులకు న్యాయం జరగట్లేదని వాపోయారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బాధితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు కానీ.. అటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అగ్రిగోల్డ్ అంశాన్ని పదో రత్నంగా భావించి బాధితులకు న్యాయం చేస్తామన్నారని.. అయితే ఇంతవరకూ ఆ దిశగా అడుగులు పడలేదని బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. రేపటి నుంచి అన్ని జిల్లాలో సచివాలయాల్లో బాధితులంతా వ్యక్తిగత అర్జీలు ఇచ్చి నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: