ETV Bharat / state

'రూ. 80 కోట్లతో ఆయిల్​ ఫామ్ రైతులకు చేయూత'

author img

By

Published : Sep 24, 2020, 5:23 PM IST

ఆయిల్ ఫామ్ టన్నుకు 11 వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ఉత్పత్తులను పెదవేగి ఫ్యాక్టరీకి తరలించే ఆయిల్​ ఫామ్​ రైతులకు ఈ ధరలు చెల్లిస్తామని చెప్పారు. ఆయిల్ ఫామ్ ధరల్లో తెలంగాణతో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు 80 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు.

ap minister kanna babu
ap minister kanna babu

రైతుల కష్టాలు పడకుండా చూడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. ఆయిల్ ఫామ్ ధరల్లో తెలంగాణతో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు 80 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట కొనుగోళ్లను టన్నుకు 11 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి ఫ్యాక్టరీకి తరలించే ఆయిల్ ఫామ్ రైతులకు ఈ ధరలు చెల్లిస్తామని తెలిపారు. ఆయిల్ ఫామ్​కు మద్దతు ధర ప్రకటించాలని కేంద్రాన్ని కోరామని పేర్కొన్నారు.

వివిధ వాణిజ్య పంటలను ప్రాసెసింగ్ చేయడం ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు కన్నబాబు. త్వరలో ఆహార శుద్ధి పాలసీని ప్రకటిస్తామని వెల్లడించారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలను ఈ పాలసీలోకి తెస్తామని వివరించారు. ప్రభుత్వమే సొంతంగా ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆలోచన చేస్తోందని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.