పంచాయతీరాజ్‌శాఖ ఇంజినీర్లు గత నాలుగు రోజులుగా చేస్తున్న ఆందోళనను మంగళవారం రాత్రి విరమించారు. విజిలెన్స్ విచారణపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంజినీర్లపై ఎలాంటి చర్యలు ఉండవని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించినట్లు ఐకాస నేతలు తెలిపారు. ఇంజినీర్ల ఐకాస ఛైర్మన్ వీవీ మురళీకృష్ణనాయుడు, ప్రధాన కార్యదర్శి జి.హనుమంతరావు, ఇతర నేతలతో మంత్రి పెద్దిరెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, చీఫ్ ఇంజినీర్ సుబ్బారెడ్డిలు విజయవాడలో మంగళవారం రాత్రి చర్చలు జరిపారు. బుధవారం నుంచి విధులకు హాజరవుతామని నేతలు వివరించారు.
ఇదీ చదవండి: ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా ఇసుక..ఉత్తర్వులు జారీ