కృష్ణా జిల్లా గుడివాడలోని ధనియాలపేటలో గత నెల 29న ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కాలనీలో నివసిస్తున్న పచ్చళ్ల వ్యాపారి నాగరాజు.. తనకు చెందిన ఆస్తిని అమ్మగా వచ్చిన సొమ్మును ఇంట్లో పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న అతని పిన్ని కూతురు, మరికొందరు వ్యక్తులతో కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. కత్తులతో నాగరాజును బెదిరించి డబ్బు దొంగిలించారు.
బాధితుని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా వారు నిజం అంగీకరించారు. వారి నుంచి రూ. 10 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో కొందరిపై రౌడీషీట్లు ఉన్నాయని.. మిగతావారిపై ఇప్పుడు రౌడీషీట్లు తెరుస్తామని చెప్పారు.
ఇవీ చదవండి: