పొట్ట కూటి కోసం పనికి వచ్చిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి మృతి చెందిన ఘటన విజయవాడ నగర శివారు ఎల్బీఎస్నగర్లో జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం రెండో అంతస్తుపై నుంచి ప్రమాదవశాత్తు పడిపోయాడు. భవనిర్మాణ కార్మికుడుకి తీవ్రగాయాలై మృతి చెందాడు. మృతుడు సింగ్ నగర్ వాంబేలానీకి చెందిన శ్రీనుగా గుర్తించారు. నున్న పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి