విజయవాడ నగర శివారులోని కండ్రికలో సుధ అనే వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అద్దె చెల్లించలేదని.. ఇంటి యజమాని సామాన్లను రోడ్డుపై పడేసిన కారణంగా.. మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి బలవర్మరణానికి పాల్పడిందని స్థానికులు చెప్పారు. మృతురాలి తల్లి స్థానికంగానే ఉన్నప్పటికీ కూతురిని పట్టించుకోవడంలేదని తెలిపారు.
అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తోడై సుధ.. ఈ అఘాయిత్యం చేసుకుందని చెప్పారు. మృతురాలి భర్త లారీ డ్రైవర్ అని.. విధి నిర్వహణ నిమిత్తం వేరే ప్రాంతంలో ఉన్నాడని గుర్తించిన పోలీసులు.. అతనికి సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన నున్న గ్రామీణ పోలీసులు.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: