ETV Bharat / state

బిడ్డ కారుణ్య మరణానికి అనుమతివ్వండి..ఓ తల్లి ఆవేదన - daughter

అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్యం అందకపోవటంతో ఆవేదనకు గురైంది ఆ తల్లి. కడుపున పుట్టిన బిడ్డ పరిస్థితి చూడలేక కారుణ్య మరణం కోరుతూ గవర్నర్​కు విన్నవించింది. వైద్యం అందిస్తారా లేక కారుణ్య మరణానికి అనుమతిస్తారా అంటూ తన గోడును వెళ్లగక్కింది.

బిడ్డ కారుణ్య మరణానికి అనుమతివ్వండి..ఓ తల్లి ఆవేదన
author img

By

Published : Aug 30, 2019, 8:50 PM IST

Updated : Aug 30, 2019, 11:08 PM IST

ఓ తల్లి ఆవేదన

ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే పట్టించుకోకపోవటంతో ఓ మాతృమూర్తి కన్నబిడ్డను చంపుకునేందుకు సిద్ధమైంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్యుల చర్యలతో విసిగిపోయిన ఆమె... కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ గవర్నర్​కు వినతిపత్రం సమర్పించింది. కోర్టు ఉత్తర్వులు తెచ్చినా.. తన కూతురికి చికిత్స అందించేందుకు వైద్యురాలు నిరాకరిస్తోందని ఆవేదన వెళ్లగక్కుతోంది.

స్థానిక సింగ్​నగర్​కు చెందిన స్వర్ణలత 2000 సంవత్సరంలో కుమార్తెకు జన్మనిచ్చింది. సంతోషంగా సాగుతున్న వారి జీవితాన్ని విధి వెక్కిరించింది. ఆమె కుమార్తె జాహ్నవికి 4వ ఏట అరుదైన మానసిక వ్యాధి సోకి.. ఎనిమిదేళ్ల వయస్సులో గైనిక్​పరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అప్పటినుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి గైనిక్ విభాగంలో ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. అయితే కొంతకాలంగా జాహ్నవికి వైద్యం చేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు నిరాకరిస్తోందని స్వర్ణలత ఆరోపిస్తున్నారు. కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చినా వైద్యులు కనీస మానవత్వం మరిచారని ఆమె తెలిపారు. తన బిడ్డ పరిస్థితి చూసి తట్టుకోలేక.. కారుణ్య మరణం(మెర్సీ కిల్లింగ్)కి అనుమతి కోరుతూ గవర్నర్​ను ఆశ్రయించినట్లు స్వర్ణలత ఆవేదన వ్యక్తం చేశారు. జాహ్నవి తండ్రి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చిరుద్యోగి కావడం విశేషం.

Intro:FILE NAME : AP_ONG_43_30_PANTAKALUVA_IBBANDULU_AV_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : సిబ్బంది నిర్లక్ష్యం పంటకాలువలో నీటి ప్రవాహానికి ఆటంకంగా మారింది.... ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని వి.ఆర్.ఎస్. అండ్ వై ఆర్ ఎన్ కళాశాల సమీపంలో తోటవారిపాలెం ఎత్తిపోతల పధకం కు సంభందించిన పంటకాలువకు ఇరువైపులా ఉన్న చిల్లచెట్లను తొలగించారు..కానీ అవి కాలువలో పడేసారు... ఇప్పుడే సాగునీరొస్తున్న సమయంలో జంగిల్ క్లియరెన్స్ అంటూ చిల్లచెట్లతో మూసేయడం ఏమిటని రైతులు అంటున్నారు... అధికారులు స్పందించి... కాలువ పూడికతియ్యాలని అన్నదాతలు కోరుతున్నారు.

Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
Last Updated : Aug 30, 2019, 11:08 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.