ETV Bharat / state

ఎస్ఈసీకి పారిశుద్ధ్య కార్మికురాలు ఫిర్యాదు - panchyathi election news

సర్పంచిగా పోటీ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు సర్పంచ్ అభ్యర్థి మురపాక పద్మావతి నామినేషన్ దాఖలు చేయగా.. దాన్ని అధికారులు తిరస్కరించారు.

A sanitation worker complained to SEC
ఎస్ఈసీకి పారిశుద్ధ్య కార్మికురాలు ఫిర్యాదు
author img

By

Published : Feb 2, 2021, 10:50 PM IST

అధికారులు అక్రమంగా నామినేషన్​ను తిరస్కరించారని... తనకు న్యాయం చేయాలని సర్పంచ్​గా పోటీ చేస్తోన్న ఓ పారిశుద్ద్య కార్మికురాలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు సర్పంచ్ అభ్యర్థి మురపాక పద్మావతి నామినేషన్ దాఖలు చేయగా.. దాన్ని అధికారులు తిరస్కరించారు. అన్యాయంగా తన నామినేషన్​ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారని ఎస్​ఈసీకి ఆమె ఫిర్యాదు చేశారు.

తాను కూలి పని చేసుకుంటుంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని వైకాపా నేతలు అధికారులు తప్పుడు నివేదిక ఇచ్చారని ఎస్​ఈసీలోని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. నామినేషన్ వేసినప్పటి నుంచి పోటీ నుంచి తప్పుకోవాలని వైకాపా నేతలు తనను హింసించారని ఫిర్యాదులో తెలిపారు. పోలీసు స్టేషన్​కు వెళ్లి కేసు పెట్టినా ఎవరూ పెట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన నామినేషన్​ను అనుమతించేలా ఆదేశించాలని ఎస్​ఈసీకి పద్మావతి విన్నవించారు.

ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలపై ఫిర్యాదులకు 'ఈ వాచ్' యాప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.