కృష్ణాజిల్లా నందివాడ మండలం కుదరవల్లిలో చేపల చెరువు వద్ద పనిచేస్తున్న పోనుగుమటి.సంసోను (22) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. గత నాలుగు రోజుల క్రితం ఆ చెరువుపై మేతకట్టలు దొంగతనం జరిగిందని గుమాస్తా వేణు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతుండగానే సంసొ మృతి కలకలం రేపింది. అనుమానంతో గుమస్తా, చెరువు యజమాని దాడి చేశారని అందుకే తన కుమారుడు చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. మృతునికి భార్య , రెండునెలల చిన్నారి ఉంది. అతని మరణం బాధిత కుటుంబంలో విషాదం మిగిల్చింది. ఈ ఘటన పై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి.కన్నబిడ్డపై... తండ్రి అఘాయిత్యం!