ETV Bharat / state

యంత్రాల కోసం... అన్నదాతల ఎదురు చూపులు.. - krishna district latestnews

విత్తనాలు చల్లే సమయం నుంచి పంట నూర్పిడి వరకు సాగులో యంత్రాల అవసరం పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కువశాతం కోతలకు వీటినే ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వాలు రాయితీపై రైతులకు యంత్రాలను ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులతో సంఘాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా యంత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. . ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేశారు. నూర్పిళ్ల ప్రక్రియ అయిపోతున్నా ఇంకా యంత్రాలు అందించకపోవడంతో రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

A machine that harvests and throws grain
పంటను కోసి ధాన్యాన్ని రాసిగా పోస్తున్న యంత్రం
author img

By

Published : Dec 8, 2020, 1:31 PM IST

రైతులకు రాయితీపై యంత్ర పరికరాలను అందించేందుకు ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ కేటాయిస్తాయి. 2015కు ముందు ఏటా జిల్లాకు రూ.4 కోట్ల వరకు కేటాయించేవారు. వినియోగం పెరిగే కొద్దీ బడ్జెట్‌ కేటాయింపులు పెరుగుతూ వచ్చాయి. 2017-18లో రూ.23.78 కోట్లు, 2018-19లో రూ.22 కోట్ల వరకు నిధులు వెచ్చించారు. 2019-20లో రాయితీ నిలిపివేశారు. ఎక్కువగా వినియోగించే మోటారు ఇంజిన్లు, స్ప్రేయర్లు, కోత, కలుపు తీత తదితర యంత్రాలు అందక వ్యవసాయదారులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు సంఘాలకు యంత్రాలు అందించి రైతు భరోసా కేంద్రాల ద్వారా వాటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించినా ఇంతవరకు ఒక్క యంత్రం కూడా అందించిన దాఖలాలు లేవు.

సంఘాలు సరే.. పరికరాలు ఏవీ?

యంత్ర పరికరాల పంపిణీలో భాగంగా జిల్లాలో 726 రైతు సంఘాలను ఏర్పాటు చేశారు. వాటి పరిధిలో ఎలాంటి యంత్ర పరికరాలు కావాలో వివరాలు సేకరించినపుడు ట్రాక్టర్లు, అనుబంధ పరికరాల కోసం ఎక్కువ మంది మొగ్గుచూపారు. వీటి మొత్తం ఖరీదులో 50 శాతం బ్యాంకు రుణం, 40 శాతం రాయితీ, 10 శాతం రైతులు తమ వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో సంఘానికి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన యంత్రాలను అందించాలని నిర్ణయించారు. ఈ యంత్రాలను రైతు భరోసా కేంద్రం వద్ద అందుబాటులో ఉంచుతామని, సంఘ సభ్యులంతా వినియోగించుకోవాలని సూచించారు. ఖరీఫ్‌లో నాట్లు వేసే సమయంలో యంత్రాలు ఇస్తామని చెప్పిన పాలకులు కోతలు పూర్తవుతున్నా పరికరాలు ఇవ్వకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

యంత్రాలు అందించేందుకు కృషి

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు సంఘాలకు యంత్రాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో రైతుసంఘాలు ఏర్పాటు పూర్తిచేయడంతో పాటు వారి చేత బ్యాంకు ఖాతాలు కూడా తెరిపించాం. ఎక్కువ మంది ట్రాక్టర్లు కావాలని కోరవడంతో ప్రభుత్వం పరిశీలిస్తోంది. త్వరలోనే ఒక్కో సంఘానికి నిర్ధేశించిన మొత్తానికి యంత్రపరికరాలు అందుతాయి. ఆ దిశగా కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. - మోహన్‌రావు, వ్యవసాయశాఖ జేడీ

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఉత్త చేతులతో ఇంటికి....

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.