ఈతకు వెళ్లిన బాలిక ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన విషాద ఘటన కృష్ణా జిల్లా నందిగామ మండలం దాములూరు గ్రామంలో నెలకొంది. ముగ్గురు బాలికలు.. గ్రామానికి సమీపంలో ఉన్న కూడలి కట్టలేరు వాగులో ఈతకు వెళ్లారు. అయితే వారిలో శేషం లావణ్య అనే ఇంటర్ విద్యార్థిని ప్రమాదవశాత్తు నీటిలో మునిగింది.
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న లావణ్యను స్థానికులు వీరులపాడులోని ఆస్పత్రికి తరలించారు. బాలిక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగిలిన ఇద్దరు బాలికలు క్షేమంగా బయట పడ్డారు. కంచికచర్ల పట్టణానికి చెందిన లావణ్య... దామూలూరు గ్రామంలో తన అమ్మమ్మ ఇంటికి వచ్చినట్టు సమాచారం.
ఇదీ చదవండి:
ఆన్లైన్ యాప్‌ల్లో రుణం... ఒత్తిడి తట్టుకోలేక యువతి ఆత్మహత్య