విజయవాడలో 90 ఎంఎల్ చిత్ర బృందం సందడి చేసింది. చిత్ర ప్రచారంలో భాగంగా నగరానికి వచ్చిన నటీనటులు మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 5న సినిమా విడుదల అవుతుందని కథానాయకుడు కార్తికేయ తెలిపారు. చిత్రంలోని పాటలు, ప్రచార చిత్రాలకి మంచి స్పందన వచ్చిందని.. కచ్చితంగా సినిమా విజయవంతం అవుతుందనే నమ్మకం కలుగుతోందని హీరో అన్నారు. సినిమాలో తన పాత్ర చాలా వైవిధ్యభరితంగా ఉంటుందని చెప్పారు. చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని ఎంతో అందంగా చిత్రీకరించారన్నారు. తన క్యారెక్టర్ కొత్తగా ఉంటుందని.. మద్యం అలవాటున్న హీరోని, హీరోయిన్ ఎలా ప్రేమించిందనేదే చిత్ర కథాంశమని హీరోయిన్ నేహా సోలంకి తెలిపారు.
ఇవీ చదవండి