ETV Bharat / state

ప్రధాన వార్తలు @ 9 PM - టాప్​ న్యూస్ @9 PM

.

టాప్​ న్యూస్ @9 PM
టాప్​ న్యూస్ @9 PM
author img

By

Published : Apr 9, 2021, 9:02 PM IST

Updated : Apr 9, 2021, 9:12 PM IST

  • రెండేళ్లుగా వైకాపా ఏం చేసిందో సమాధానం చెప్పాలి: చంద్రబాబు
    రెండేళ్ల పాలనలో ఏం చేసిందని వైకాపాకు ఓటేయాలని తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నిలదీశారు. మద్యపాన నిషేధం అంశంపై జగన్‌ నమ్మక ద్రోహం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • పదో తరగతి పరీక్షల సమయం పెంచుతూ సవరణ ఉత్తర్వులు
    పదో తరగతి పరీక్షలకు సమయం పెంచుతూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మొదటి, ద్వితీయ, తృతీయ భాష పరీక్షలకు సమయాన్ని పొడిగిస్తూ.. ఈ సమయాలను వర్తింపజేయాల్సిందిగా పరీక్షల డైరెక్టర్​ను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2,765 కేసులు
    రాష్ట్రంలో కొవిడ్ వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా 2,765 మంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరేసి.. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఆ బాలుడి ఆకలి బాధకు ఎంగిలి ప్లేటే దిక్కాయే!
    తినడానికి తిండిలేక చెత్తకుప్పల్లో విసిరేసిన ఎంగిలి ఆకుల్లో ఆహారం తినే దృశ్యాలు సినిమాల్లో చూస్తుంటాం. అచ్చం ఇలాంటి ఘటనే ఒడిశాలో వెలుగుచూసింది. ఆకలితో రెండున్నరేళ్ల బాలుడు.. ఎవరో విసిరేసిన ఎంగిలి​ ప్లేటును నాకుతూ కనిపించాడు. అత్యంత బాధాకరమైన ఈ దృశ్యాలు నెటిజన్లను కలచివేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కన్యత్వ పరీక్షలో విఫలం- ఇంటి నుంచి వెళ్లగొట్టిన భర్తలు
    కన్యత్వ పరీక్షలో విఫలమయ్యారనే సాకుతో వివాహమైన మూడు రోజులకే తమ భార్యలను పుట్టింటికి పంపించారు ఇద్దరు వ్యక్తులు. మహారాష్ట్ర కొల్హాపూర్​కు చెందిన అక్కాచెల్లెళ్లను వివాహమాడిన కర్ణాటక బెల్గాం​ వాసులు ఈ దారుణానికి పాల్పడ్డారు. 2020 నవంబర్ ఈ ఘటన జరగ్గా.. మూఢ నమ్మకాల నిర్మూలన సంస్థకు బాధితులు రాసిన లేఖ ద్వారా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'కొవిడ్​ అనంతరం కొత్త ఉపాధి అవకాశాలు'
    భారత్​, నెదర్లాండ్​ లాంటి ప్రజాస్వామ్య దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగైతే ఇరు దేశాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్​-యూరోపియ్​ యూనియన్​ సమ్మిట్​లో ఇరుదేశాలకు సంబంధించి కొత్త అవకాశాల గురించి చర్చిద్దామని నెదర్లాండ్​ ప్రధాన మంత్రి మార్క్​ ర్యూట్​తో వర్చువల్ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • అదిరే ఫీచర్లతో వన్​ప్లస్​ 9ఆర్​ 5జీ!
    చైనా స్మార్ట్​ఫోన్​ దిగ్గజం వన్​ప్లస్​ గేమింగ్​ ప్రియులకు సరికొత్త అనుభూతినిచ్చేలా నయా ఫోన్​ను ఆవిష్కరించింది. 5జీ టెక్నాలజీతో అందుబాటులోకి రానున్న ఈ మొబైల్​ను వన్​ప్లస్​ 9ఆర్​ 5జీ పేరుతో తీసుకొస్తున్నారు. రెండు వేరియంట్లలో లభించనున్నఈ ఫోన్​ ధరలు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • టాస్​ గెలిచిన బెంగళూరు.. ముంబయి బ్యాటింగ్​
    చెన్నై వేదికగా జరగనున్న ఐపీఎల్​ తొలి మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు, ముంబయి ఇండియన్స్​ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్​లో భాగంగా టాస్​ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఫీల్డింగ్​ ఎంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • 'దెయ్యం'తో మళ్లీ వస్తున్న ఆర్జీవీ
    రామ్​గోపాల్ వర్మ-రాజశేఖర్​ కాంబోలో తెరకెక్కిన 'దెయ్యం' చిత్రం.. ఈ నెల 16న థియేటర్లలోకి రానుంది. శుక్రవారం వచ్చిన ట్రైలర్​, ఆద్యంతం ఆసక్తిని పెంచుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కొవిడ్ దెబ్బకు కంగన 'తలైవి' వాయిదా
    కరోనా ప్రభావం మరో సినిమాపై పడింది. కంగన 'తలైవి' విడుదల వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Last Updated : Apr 9, 2021, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.