జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇటీవల తనిఖీలు ముమ్మరం చేసింది. ఈ దాడుల్లో పట్టుబడిన 760 లీటర్ల నాటు సారాను ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సమక్షంలో విజయవాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని మురుగు కాల్వలో పారబోశారు. నాటు సారా… అక్రమ మద్యం కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ముకుల్ జిందాల్, ట్రైనీ ఐపిఎస్ ప్రేరణ కుమార్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: విజయవాడలో పోలీసులు, జనసైనికుల మధ్య తోపులాట