తెలంగాణ రాష్ట్రంలోని మధిర నుంచి ఆటోలో తరలిస్తున్న 186 మద్యం సీసాలను కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ వద్ద పోలీసులు పట్టుకున్నారు. చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ మద్యం బయటపడింది. మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి.