ఇదీ చదవండి: జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం
పద మూడో రోజుకు చేరుకున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్ - eenadu cricket league in vijayawada news
ఈనాడు ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు పదమూడో రోజుకు చేరుకున్నాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో నెగ్గిన జట్లు ఫైనల్స్‌కు చేరుకున్నాయి.
పదమూడో రోజుకు చేరుకున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్
విజయవాడ గూడవల్లిలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ పదమూడో రోజుకు చేరుకున్నాయి. జూనియర్, సీనియర్ విభాగాల్లో 4 జట్లు తలపడ్డాయి. మెుదట జూనియర్ మ్యాచ్‌లో విశ్వశాంతి జూనియర్ కళాశాల, ఆంధ్ర లయోలా జూనియర్ కళాశాల జట్లు తలపడ్డాయి. ఒక్క పరుగు తేడాతో విశ్వశాంతి జూనియర్ కళాశాల విజయం సాధించింది. మెుదట సీనియర్ విభాగంలో పీబీ సిద్ధార్ధ డిగ్రీ, లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల జట్లు పోటీ పడగా, సిద్ధార్ధ కళాశాలను విజయం వరించింది. రెండో జూనియర్ మ్యాచ్‌లో కేబీఎన్ జూనియర్ కళాశాల, సిద్ధార్ధ కళాశాల జట్లు పోటీ పడ్డాయి. 9 వికెట్ల తేడాతో సిద్ధార్ధ గెలుపొందింది. రెండో సీనియర్ మ్యాచ్‌లో నలంద డిగ్రీ, ఎమ్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల జట్లు తలపడగా, నలందా డిగ్రీ కళాశాల 44 పరుగుల తేడాతో గెలుపొందింది. విజయం సాధించిన 2 జట్లు పైనల్స్‌కు చేరుకున్నాయి.
ఇదీ చదవండి: జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం
sample description