108 Staff Strike : 108, 104 అంబులెన్స్ సిబ్బంది సమ్మెకు సమాయత్తమవుతున్నారు. ఈ నెల 22వ తేదీలోగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు పత్రాలను అందజేశారు. పరిష్కరించకుంటే ఈనెల 23 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈనెల 22 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిబ్బంది వెల్లడించారు. సమ్మె నోటీసు ప్రతులను ఆరోగ్యశ్రీ సీఈవోతో పాటు వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేశారు.
దాదాపు 7 వేల మంది ఉద్యోగస్తులు 108, 104 తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్‌ల్లో పని చేస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. అందరినీ ఆప్కాస్‌లో చేర్చాలని, ఈఎంటీ పోస్టుల భర్తీలో వెయిటేజీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనెల 22వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేస్తామని 108, 104 సంఘాల నేతలు వెల్లడించారు.