ETV Bharat / state

దండకారణ్యానికి కరోనా సెగ.. వైరస్​తో 10 మంది మావోల కన్నుమూత!

author img

By

Published : May 12, 2021, 8:17 AM IST

కరోనాకు సామాన్య ప్రజలు, ప్రముఖులనే బేధమేమీ లేదు. ఈ క్రమంలో అడవుల్లో ఉండే మావోయిస్టులను సైతం బలి తీసుకుంటోంది. దండకారణ్యంలోనూ కొవిడ్ పంజా విసురుతోంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దక్షిణ బస్తర్‌ అటవీ ప్రాంతాల్లో కరోనా కలకలంతో దాదాపు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు మంగళవారం అక్కడి పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందింది.

దండకారణ్యానికి కరోనా సెగ.. వైరస్​తో 10 మంది మావోల కన్నుమూత

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దక్షిణ బస్తర్‌ అటవీ ప్రాంతాల్లో కరోనా కల్లోలంతో దాదాపు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు మంగళవారం అక్కడి పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఇటీవలే దండకారణ్య ప్రాంతంలో సుకుమా, దంతెవాడ, బీజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతాల్లో దాదాపు 100 మంది మావోయిస్టులు కరోనా బారినపడ్డారని, విషాహారం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని నిఘావర్గాల ద్వారా అధికారులకు సమాచారం చేరింది.

కరోనా బారిన మావో అగ్ర నేతలు..

తాజాగా మంగళవారం వీరిలో దాదాపు 10మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీస్‌ అధికారులు భావిస్తున్నారు. కరోనా బారినపడిన వారిలో దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ నేత సుజాతతో పాటు మావోయిస్టు అగ్రనేతలు జయలాల్‌, దినేశ్‌ కూడా ఉన్నట్లు అధికారులకు సమాచారం ఉంది. మృతిచెందిన మావోయిస్టుల్లో సీఆర్‌సీ సభ్యులు(సెంట్రల్‌ రీజినల్‌ కమాండ్‌) పీఎల్‌జీఏ సభ్యులు, ప్లాటూన్‌ సభ్యులు ఉన్నట్లు పోలీస్‌ అధికారులు అనుమానిస్తున్నారు. వారికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ అధికారులు ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా దృష్టి సారించినట్లు సమాచారం.

గిరిజనులతో సమావేశాల కారణంగా..

కరోనా సంబంధిత జాగ్రత్తలేవీ పాటించకుండా సరిహద్దు ప్రాంతాల గిరిజనులతో సమావేశాలు నిర్వహించటం కారణంగా పలువురు మావోయిస్టులు కొవిడ్‌ బారిన పడినట్లు తమకు కీలక సమాచారం అందిందని దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ నిర్ధారించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఔషధాలు తీసుకోవటం వల్ల కూడా వారిలో అనేకమంది తీవ్ర అనారోగ్యానికి గురయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ఆయన పేర్కొన్నారు.

అలా చేస్తే వైద్య సేవలు అందిస్తాం : ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌

సమావేశాల రూపేణా వందలాది గిరిజనులను ప్రమాదంలోకి నెట్టిన మావోయిస్టులు.. తాము సైతం విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారు స్వచ్ఛందంగా లొంగిపోతే అత్యవసర వైద్యసేవలు అందించటం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి : నాలుగున్నర గంటల ఆలస్యం.. గాల్లో కలిసిన 11 ప్రాణాలు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.