ETV Bharat / state

ఇక్కడ మీకేం పని.. పోలీసులపై ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం

MLA Chirla Angry On Police: కోడి పందేలు, గుండాటలు జరగకుండా చూడాల్సిన నాయకులే దగ్గరుండి పందేలు నిర్వహించేవారిని ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా కోడిపందేల బరుల వద్దకు పోలీసులు వస్తే ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పోలీసులు వస్తే ఎందుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసి.. అక్కడి నుంచి వారిని పంపించేశారు

కోడిపందాలు
కోడి పందాలు
author img

By

Published : Jan 14, 2023, 2:27 PM IST

MLA Chirla Angry On Police: అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కోడిపందేల బరుల వద్ద ఉన్న పోలీసులపై ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి పందేలు, గుండాటలు నిర్వహించేందుకు అనుమతులు లేవని పోలీసులు గుండాట శిబిరాలను తొలగిస్తున్న సమయంలో జగ్గిరెడ్డి అక్కడకు చేరుకుని పోలీసులపై మండిపడ్డారు. కోడి పందేల బరుల వద్ద ఇక్కడ మీకేం పనంటూ మండిపడ్డారు. ఇది ప్రైవేటు స్థలమని.. కేసులుంటే నాపై పెట్టమంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు... కాగా అడిషనల్ ఎస్సై సురేంద్రను, పోలీస్ సిబ్బందిని ఈ స్థలం నుండి వెళ్లిపోవాలని సూచించారు. అనంతరం కోడిపందేలను చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు.

కోడిపందాల బరుల వద్ద ఉన్న పోలీసులపై ఆగ్రహిస్తున్న ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.