ETV Bharat / state

వీడియో: హెడ్​మసాజ్​ చేయలేదని సెలూన్​ యజమానిని చితకబాదిన యువకులు - saloon shop lo godava

attack on salon owner: ప్రస్తుత రోజుల్లో కొందరు యువకులు కారణం లేకుండానే గొడవలు పెట్టుకుంటున్నారు. చిన్న, చిన్న విషయాలకే ఎదుటి వారిపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనే హనుమకొండలో చోటుచేసుకుంది.

Youth attack
యువకుల దాడి
author img

By

Published : Dec 31, 2022, 8:39 PM IST

attack on salon owner: తెలంగాణలోని హనుమకొండ జిల్లా కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు ఓ సెలూన్ యజమానిని చితకబాదారు. దాడి ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. వివరాల్లోకి వెళితే.. నైమ్​నగర్​లోని రేయలెన్స్ సెలూన్​కు శుక్రవారం రాత్రి 10 గంటలకు ఇద్దరు వ్యక్తులు వచ్చి హెడ్ మసాజ్ చేయాలని అడగగా.. సమయం లేదని సెలూన్ యజమాని రంజిత్ చెప్పాడు. దీంతో యువకులు గొడవకు దిగారు. యజమాని రాజేశ్​పై ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

హెడ్​మసాజ్​ చేయలేదని సెలూన్​ యజమానిపై దాడి

ఈరోజు హనుమకొండ పోలీస్​స్టేషన్​లో యజమాని రాజేశ్​ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.