ETV Bharat / state

కోనసీమ జిల్లాలో రేపు ఉదయంలోగా ఇంటర్‌నెట్‌ సేవల పునరుద్ధరణ

author img

By

Published : May 31, 2022, 9:00 PM IST

Updated : May 31, 2022, 9:22 PM IST

ఇంటర్‌నెట్‌ సేవల పునరుద్ధరణ
ఇంటర్‌నెట్‌ సేవల పునరుద్ధరణ

20:58 May 31

తొలుత మూడు మండలాల్లో అందుబాటులోకి

Konaseema Issue: అమలాపురం అల్లర్ల కారణంగా కోనసీమ జిల్లాలో నిలిచిన ఇంటర్​నెట్ సేవలను పునరుద్ధరించనున్నట్లు జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. తొలుత సకినేటిపల్లి, మల్కిపురం, ఐ.పోలవరం మండలాల్లో ఇంటర్​నెట్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ మేరకు కలెక్టర్​కు నివేదించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ అర్థరాత్రి లేదా రేపు ఉదయంలోగా సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. మిగతా మండలాల్లో దశలవారీగా సేవల పునరుద్ధరణ ఉంటుందన్నారు.

ఏం జరిగిందంటే: ఈనెల 24న కోనసీమ జిల్లా అమలాపురం ఆందోళనలతో అట్టుడికింది. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్ కార్యాలయానికి వందలాదిగా చేరుకున్న నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి.

సెక్షన్‌ 144, 30 పోలీస్‌ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు తీవ్ర నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు వేల మంది ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు. నెలన్నర కిందట జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఇదీ చదవండి

Last Updated : May 31, 2022, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.