ETV Bharat / state

కేశవరం గ్రావెల్‌ అక్రమ తవ్వకాల పరిశీలనకు టీడీపీ పిలుపు - నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించిన పోలీసులు - illegal gravel mining news

Police Arrest TDP Leaders in Mandapet: కోనసీమ జిల్లా కేశవరంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాల పరిశీలనకు సిద్ధమైన తెలుగుదేశం, జనసేన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. కేశవరం వెళ్లకుండా మండపేట టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావును బలవంతంగా జీపులో ఎక్కించి, అంగర స్టేషన్‌కు తరలించారు.

Police_Arrest_TDP_Leaders_in_Mandapet
Police_Arrest_TDP_Leaders_in_Mandapet
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 1:42 PM IST

Police Arrest TDP Leaders in Mandapet: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరం సమీపంలో జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాల పరిశీలనకు సిద్ధమైన తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం, అరెస్టులు చేశారు. కేశవరం వెళ్లకుండా మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావును, పార్టీ శ్రేణులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కేశవరం గ్రావెల్‌ అక్రమ తవ్వకాల పరిశీలనకు టీడీపీ పిలుపు - నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించిన పోలీసులు

TDP Call on Illegal Gravel Mining: కేశవరం సమీపంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్‌ తవ్వకాల ప్రదేశాలను పరిశీలించేందుకు.. టీడీపీ, జనసేన శ్రేణులు పెద్దఎత్తున తరలిరావాలని టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు నేడు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బుధవారం తెల్లవారుజాము నుంచే ఎమ్మెల్యే జోగేశ్వరరావుతో పాటు.. అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే ఆనందరావు, కొత్తపేట మండలం వాడపాలెంలో మాజీ ఎమ్మెల్యే సత్యానందరావు, తెలుగుదేశం మిత్రపక్షమైనన జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌లను సైతం గృహ నిర్బంధం చేసి, ఇంటి వద్ద ఆంక్షలు విధించారు.

సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ 'చలో పుట్టపర్తి'కి టీడీపీ పిలుపు-నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు

TDP MLA Jogeswara Rao Comments: టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ..''మేము జగనన్న కాలనీలో గ్రావెల్ తరలింపుకు వ్యతిరేకం కాదు. కానీ, తోట త్రిమూర్తులు కలెక్టర్ ద్వారా అనుమతులు పొంది, గ్రావెల్ అక్రమంగా తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే కోట్ల రూపాయలు విలువైన 15 వేల లారీల మట్టి తరలించారు. అందుకే ఈరోజు కేశవరం సమీపంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్‌ తవ్వకాల ప్రదేశాలను పరిశీలించేందుకు మిత్రపక్షమైన టీడీపీ-జనసేన నేతృత్వంలో పిలుపునిచ్చాము. కేశవరం బయలుదేరడానికి సిద్దమైన మమ్మల్ని పోలీసులు అరెస్డ్, గృహనిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.'' అని ఆయన అన్నారు.

న్యాయమూర్తులు, గవర్నర్లకు లేవు రాచమర్యాదలు! ఇంటెలిజెన్స్ చీఫ్​కు మాత్రం దగ్గరుండి చూస్తోన్న పోలీసులు

TDP Workers Fire on Police Behavior: అనంతరం పోలీసుల నిర్బంధాలను దాటుకొని.. కేశవరం గ్రావెల్‌ అక్రమ తవ్వకాల పరిశీలనకు సిద్ధమైన ఎమ్మెల్యే జోగేశ్వరరావును అధికారులు.. బలవంతంగా జీపులో ఎక్కించి, అంగర స్టేషన్‌కు తరలించారు. దాంతో మండపేట టీడీపీ నేతలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ పాలనలో వైసీపీ నాయకులు అక్రమ దందాలతో రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. కోనసీమ జిల్లా కేశవరం సమీపంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్‌ తవ్వకాల పరిశీలనకు అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

Janasena President Durgesh Comments: కేశవరం వెళ్లొద్దని టీడీపీ, జనసేన నేతలను పోలీసులు హెచ్చరించడంపై జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో జరుగుతున్న అక్రమ దందాలు, వ్యాపారాలు, గ్రావెల్ ప్రదేశాలను ప్రతిపక్షాల నేతలు పరిశీలించకూడదా..? అని నిలదీశారు. తెలుగుదేశం, జనసేన నాయకులను ఎక్కడకక్కడ పోలీసులు గృహ నిర్బంధం, అరెస్ట్‌లు చేయడం అరాచక పాలనకు అద్దపడుతుందని ఆయన విమర్శించారు.

Anam Ramanarayana Reddy House Arrest: అక్రమ మైనింగ్‌ పరిశీలనకు వెళ్లకుండా బలప్రయోగం.. 'సైకో' ఆనందం కోసం పనిచేస్తున్న పోలీసులు : ఆనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.