ETV Bharat / state

తితిదే ఛైర్మన్ కు.. శిరసు వంచి మోకాళ్లపై కూర్చొని దండాలు పెట్టిన మంత్రి..!

author img

By

Published : Apr 30, 2022, 1:59 PM IST

Minister Chelluboyina: అమలాపురంలో దివంగత మాజీ శాసనసభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభలో చోటు చేసుకున్న సంఘటన అక్కడున్నవారందరినీ విస్మయానికి గురి చేసింది.

Minister Chelluboyina at Chittabbai Memorial meeting

Minister Chelluboyina: కోనసీమ జిల్లా అమలాపురంలో దివంగత మాజీ శాసనసభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభలో ఓ సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మోకాళ్లపై కూర్చొని దండాలు పెట్టడం అక్కడున్నవారికి విస్మయం కలిగించింది.

తితిదే ఛైర్మన్ కు శిరసు వంచి మోకాళ్లపై నమస్కరించిన మంత్రి...అవాక్కయిన సభ్యులు..

"ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మీరూ అందించిన సహకారం మరువలేనిది.. మీకు మా సామాజికవర్గం మొత్తం రుణపడి ఉంటారు" అని చెబుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎదుట శిరసు వంచి మోకాళ్ళపై ప్రణమిల్లి నమస్కరించారు. అప్పుడు మంత్రిని భుజం తట్టి పైకిలేపారు తితిదే చైర్మన్ సుబ్బారెడ్డి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మోకాళ్లపై కూలబడిన తీరు.. తలవంచి దండాలు పెట్టిన తీరు చూసి.. అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇదీ చదవండి : నా వేధింపుల గురించి చెబితే.. మెడలో ఆ తాళి కట్టేస్తా: కీచక టీచర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.