ETV Bharat / state

అక్కడ కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక.. జలదిగ్బంధంలోనే లంకగ్రామాలు

ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 17.75 అడుగులకంటే తగ్గితే హెచ్చరికను ఉపసంహరించే వీలుంది. ప్రస్తుతం ధవళేశ్వరం నుంచి 20.89 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఇంకా కోనసీమ జిల్లాలోని 18 మండలాల్లో 70 గ్రామాలు, 104 ఆవాస ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.

flood water
వీడని జలగండం
author img

By

Published : Jul 19, 2022, 10:04 AM IST

గోదావరి ఉగ్రరూపం కాస్త తగ్గినా లంక గ్రామాలను, లోతట్టు ప్రాంతాలను జలగండం వీడలేదు. ఆదివారం తెల్లవారుజామున మూడింటికి అత్యధికంగా 21.70 అడుగులకు ధవళేశ్వరం బ్యారేజీ నీటిమట్టం నమోదైంది. అత్యధికంగా 25.80 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. ఆ తర్వాత నుంచి వరద తగ్గడంతో సోమవారం రాత్రి 9గంటలకు 18.8 అడుగులకు తగ్గగా, 20.89 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 17.75 అడుగులకంటే తగ్గితే మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే వీలుంది.

లంకలు విలవిల: కోనసీమ జిల్లాలోని 18 మండలాల్లో 70 గ్రామాలు, 104 ఆవాస ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. బాధితుల కోసం 74 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. జిల్లాలో 22 గ్రామాల్లో అంధకారం నెలకొంది. జిల్లావ్యాప్తంగా 19 చోట్ల ఏటిగట్లు బలహీనపడ్డాయని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాలో 45 వరద ప్రభావిత గ్రామాలుండగా.. ఎనిమిది గ్రామాల్లో ఇబ్బందులు తలెత్తాయి. రాజోలు మేకలపాలెం నుంచి నున్నవారిబాడువ వరకు జలదిగ్బంధంలో ఉంది. గట్టుపక్కన ముంపునకు గురైన బాధితులు 30 మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలించారు.
* పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని 15 లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నరసాపురం మాధవాయపాలెం వద్ద గట్టుకోతకు గురవడంతో యుద్ధప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టారు. పాలకొల్లు-నరసాపురం ప్రధాన రహదారిపై వరద కొనసాగుతోంది.
* ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఇంకా తేరుకోలేదు. ఈ మండలాల్లోని 80కి పైగా అవాస ప్రాంతాలు చీకటిలోనే మగ్గుతున్నాయి. 61 గ్రామాలకు చెందిన 126 నివాసిత ప్రాంతాలు ముంపునకు గురయినట్లు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. భద్రాచలం వద్ద సోమవారం సాయంత్రం 56 అడుగులకు చేరుకున్నట్లు సీడబ్ల్యూసీ వర్గాలు తెలిపాయి.
* అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం మండలం చింతరేవుపల్లిలో 800 కుటుంబాలు సమీపంలోని గుట్టపై తలదాచుకున్నాయి. సోమవారం కొందరు అధికారులు వెళ్లి 3రేషన్‌కార్డులకు ఒక పాల ప్యాకెట్‌, కార్డుకు రెండు బిస్కెట్లు ఇచ్చారు.
* పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద సోమవారం సాయంత్రానికి నీటిమట్టం 35.51 మీటర్లకు చేరుకుంది. 48 గేట్ల నుంచి 17.95 లక్షల క్యూసెక్కులను విడిచిపెడుతున్నారు.

ఇవీ చవదండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.