ETV Bharat / state

'మంత్రి వేణు గోపాల కృష్ణ.. తన పదవికి రాజీనామా చేయాలి'

శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మంత్రి వేణు గోపాల కృష్ణ వ్యవహరించారని జనసేన పార్టీకి చెందిన ఆ సంఘం నాయకులు ఆరోపించారు. శెట్టిబలిజ జాతి జగన్‌కు రుణపడి ఉంటుందంటూ మంత్రి.. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కాళ్ల వద్ద మోకరిల్లటంపై వారు తీవ్రస్థాయిలో మండిప్డడారు.

జనసేన నేతలు
జనసేన నేతలు
author img

By

Published : May 3, 2022, 5:06 PM IST

మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ.. శెట్టి బలిజ సామాజిక వర్గం అంతా బాధ పడే విధంగా వ్యవహరించారని కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీకి చెందిన శెట్టిబలిజ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శెట్టిబలిజ జాతి జగన్‌కు రుణపడి ఉంటుందంటూ మంత్రి.. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కాళ్ల వద్ద మోకరిల్లటంపై వారు తీవ్రస్థాయిలో మండిప్డడారు. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన మంత్రి వేణు గోపాల కృష్ణ ఈ విధంగా ప్రవర్తించడం ఎంత మాత్రం క్షమించరాని అంశమన్నారు. దీనిపై మంత్రి క్షమాపణ చెప్పి.. తన మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.

మంత్రి ఏమన్నారంటే..: గత నెల 30న కోనసీమ జిల్లా అమలాపురంలో దివంగత మాజీ శాసనసభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభ నిర్వహించారు. సభలో పాల్గొన్న రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మోకాళ్లపై కూర్చొని, శిరసు వంచి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి దండాలు పెట్టారు. "ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మీరూ అందించిన సహకారం మరువలేనిది.. మీకు మా సామాజికవర్గం మొత్తం రుణపడి ఉంటుంది" అని చెబుతూ.. వైవీ సుబ్బారెడ్డి ఎదుట శిరస్సు వంచి మోకాళ్ళపై ప్రణమిల్లి నమస్కరించారు. మంత్రి మోకాళ్లపై కూలబడటం..,తలవంచి దండాలు పెట్టిన తీరు చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఇదీ చదవండి: "మంత్రి తీరు దుర్మార్గం.. క్షమాపణ చెప్పకపోతే బుద్ధి చెపుతాం"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.