ETV Bharat / state

Road Accidents: అందివచ్చిన కుమారులు అనంతలోకాలకు.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి - రోడ్డు ప్రమాదాలు

Road Accidents: రాష్ట్రంలో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాలు ఆయా కుటుంబాల్లో చీకట్లు నింపాయి. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటారనుకున్న కుమారులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో కుమారుల్ని కోల్పోయిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Road Accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jun 19, 2023, 12:13 PM IST

Road Accidents in Andhra Pradesh: అందివచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదాలలో మరణించడంతో.. ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ప్రమాదాలలో యువకులే ఎక్కువ మంది ఉన్నారు. ఓ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. దీనికి కారణం మద్యం సేవించి వాహనం నడపటం, అతివేగమే కారణంగా తెలుస్తోంది.

అంబులెన్స్​ను ఢీ కొట్టిన.. ద్విచక్ర వాహనం: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సంకటరేవు గ్రామం జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనం.. అంబులెన్స్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన నల్లి బాలకృష్ణ, చింతా అరుణ్ బోస్‌గా గుర్తించారు. యానంలో మద్యం తాగిన యువకులు ద్విచక్రవాహనంపై యానం నుంచి కాకినాడకి వస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్.. కాకినాడలో రోగులను దింపి తిరిగి యానాంకి వస్తోంది. ఈ సమయంలో ఓ మలుపు వద్ద.. అంబులెన్స్​ను యువకుల ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మృతుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా వారి బంధువులకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొన్నారు.

స్నేహితుడి కోసం వెళ్లి.. మృతి: ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు కొమరోలు మండలం రెడ్డి చర్ల గ్రామానికి చెందిన కాశి నాగేశ్వరరావుగా (27) పోలీసులు గుర్తించారు.

స్నేహితుడిని కలిసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని బేస్తవారిపేట ఎస్సై మాధవరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ హాస్పిటల్​కి తరలిస్తున్నామని అన్నారు.

వ్యాన్ బోల్తా పడి యువకుడు మృతి: అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం బరిమామిడిలో వ్యాన్ బోల్తా పడి యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా తెలుగులోకి వచ్చింది. గంగవరం మండలం నుంచి గోకవరం వైపు కలప తరలిస్తున్న వ్యాన్​పై 11 మంది కూలీలు కూడా ఉన్నారు.

ఆ వాహనం బర్రిమామిడి శివారులో బోల్తా పడటంతో.. వ్యాన్​పై ఉన్న 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో దుంగల కింద చిక్కుకొని ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. సమాచారం తెలుసుకున్న గంగవరం ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. గంగవరం తహసీల్దార్ శ్రీమన్నారాయణ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.